ఫిలింనగర్: బడుగు, బలహీన వర్గాలకు న్యాయం సలహాలు అందించేందుకు జస్టిస్ బి. సుభాషణ్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు ఫౌండర్ ట్రస్టీ బొల్లంపల్లి ఇంద్రసేన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఫిలింనగర్ లోని మహిళా భవ నంలో బస్తీవాసులకు, స్థానికులకు ఉచిత న్యాయ సేవలు, సలహాలపై అవగాహన సదస్సు నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఇంద్రసేన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పేద వారు న్యాయపరమైన సమస్యల్లో చిక్కుకుంటే ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితి నెలకొందని అలాంటి వారి కోసం తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యాయసలహాలు, న్యాయసేవలు ఉచితంగా అందిస్తామని తెలిపారు. ప్రస్తుత తరుణంలో ఒక న్యాయవాదిని నియమించుకొని న్యాయం పొందడం అనేది బడుగులకు తలకుమించిన భారంగా మారుతున్నదని ఆయన అన్నారు.
నగరంలోని అన్ని బస్తీల్లో ప్రతి వారం మూడు రోజులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి సేవలు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ కరపత్రాన్ని, హెల్ప్ లైన్ నెంబర్ను ఆయన బస్తీవాసులకు అందించారు. అనంతరం బస్తీవాసులు తమ న్యాయపరమైన సమస్యలను వారి దష్టికి తీసుకెళ్ళి పరిష్కారాలను పొందారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, రాహుల్రెడ్డి, స్థానిక నేతలు పద్మ, కుమార్, మారెమ్మ తదితరులు పాల్గొన్నరు.