పారిశ్రామిక విప్లవం మన జీవితాల్లో గొప్ప మార్పుల్ని తేవడంతో పర్యావరణానికి జరుగుతున్న హానిని గురించి మనిషి విస్మరించాడు.
నిజానికి బొగ్గు వంటి పునరుత్సాదక ఇంధన _ శిలాజ ఇంధనాలతో నిపుణులు పాటు మనం పర్యావరణాన్ని కూడా చేజేతులా తగులబెట్టుకుంటున్నాం. పర్యావరణం కన్నా ఆర్థికాభివృద్ధికే ప్రాముఖ్యం ఇస్తూ వచ్చాం. కానీ, ఇప్పుడు సమయం వచ్చింది, పరిస్థితి చేయిదాటిపోక మునుపే మనం చర్యలకు పూనుకోవాలి.
మన దేశంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి దాదాపు 8,000 కిలోల చొప్పున బొగ్గును ఇంధనంగా ఉపయోగిస్తున్నాం. మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏడాదికి 1.9 టన్నుల కార్చన్డై ఆక్స్సెడ్ వ్ష వాయువు వాతావరణంలోకి విడుదలయ్యేరదుకు కారణమవుతున్నాం. మన తలసరి విద్యుత్ వినియోగం 2019-20 నాటికి 1210 యూనిట్ల (3.డబ్య్యూ. 'హెచ్.)కు పెరిగింది.
ప్రపంచ జనాభాలో భారతీయల సంఖ్య 18% అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఖర్చవుతున్న విద్యుత్తులో మనం వాడుతున్నది 6% మాత్రమే. కర్చన ఉద్గారాలను వెలువరించడంలో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. సరికొత్త వ్యాపార నమూనాలు, జీవన శైలిలో కొత్త పోకడల మూలంగా మున్ముందు మన వినియోగం కూడా బాగా పెరిగేలా ఉంది. విద్యుత్తు ఉత్పత్తికి ఇప్పటి మాదిరిగానే బొగ్గు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాలను వాడటమే మనం కొనసాగిస్తే ఉష్ణోగ్రతలు, ముద్రపు నీటి మట్టాలు అంతకంతకూ పెరుగుతాయి. అంతేకాదు, కార్చిచ్చులు మరిన్ని అంటుకుంటాయి. నీటి దారిద్ర్యం, ఆరోగ్య సమస్యలు, నేల కోతకు గురికావటం... వంటి సమస్యలు అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి. సరిగ్గా వచ్చే ఇరవయ్యేళ్లలో పరిశ్రమలు, రవాణా రంగంలో ఇంధన వినియోగం 50% పెరగనుంది. గ్యాసోలిన్ వినియోగం గత రెండేళ్లలోనే 15% పెరిగినట్లు అంచనా. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజారవాణాలో ప్రయాణించడం కన్నా సొంత వాహనాల వాడకమే క్షేమదాయకమని ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నందున పెట్రోలు,డీజిల్ వినియోగం మరింత పెరగనుంది. దానితోపాటు కాలుష్యమూ పెరుగుతుంది.
పునరుత్వాదక వనరులే దిక్కు
2050 నాటికి ఉష్ణోగ్రత 2 డిగ్రీలకు మించి పెరగనీయకూడదు అనుకుంటే మనం విధిగా పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం ద్వారా కార్చన్డై ఆక్సెడ్ ఉద్గారాలను 70% తగ్గించాల్సి ఉంటురిటి. కేవలం పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మాత్రమే కాదు, రూ. లక్షల కోట్ల విలువైన ఆస్తులను పరిరక్షించుకోవాలన్నా మనం ఇప్పటికిప్పుడు కార్యాచరణకు ఉపక్రమించాలి. మన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పర్యావరణ హితమైన ఇంధన వనరుల వైపు మళ్లక తప్పదు. భూతాపోన్నతిని దీటుగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం తగిన విధాన నిర్ణయాలను తీసుకొని అమల్లోకి తేవాల్సి ఉంటుంది.
వాగ్దానాలు నెరవేర్దేదెలా?
భూతాపోన్నతిని కట్టడి చేయడం కోసం 20/0 నాటికి 'నెట్ జీరో” స్థాయికి ఉద్గారాలను తగ్గిస్తానని గ్లాస్తో వేదికగా జరిగినీ శిఖరాగ్ర “సదస్సులో 'భారత్ ఇటీపల వాగ్జానం చేసింది. ఈ వాగ్దానం నెరవేరాలంటే అన్ని - పరిశ్రమలు, వ్యవసాయం, నివాస గృహాలు, వాణిజ్యం, రైల్వేలు, రవాణా - రంగాలలోనూ బొగ్గు వంటి శిలాజ ఇంధనాలకు బదులు... సౌరశక్తి, పవన విద్యుత్తు, జల విద్యుత్తు, జియోథర్మల్, బయోమాస్, టైడల్ తదితర పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని యుద్ధప్రాతిపదికన పెంపొందించాల్సి ఉంటుంది.
మనం ఏం చేయొచ్చు?
అ అవసరం ఉన్నప్పుడే పొదుపుగా విద్యుత్తు వాడాలి. ఎయిర్ కండిషనర్లు, సబ్మెర్సిబుల్ పంపులు, హీట్ పంపులు వంటి విద్యుత్తును ఎక్కువగా ఖర్చు చేసే వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. అ విద్యుత్తును ఆదా చేసే ఉపకరణాలను మాత్రమే ఉపయోగించాలి.
6 నివాస గృహ రంగానికి ఇంధన సబ్సిడీలను కొనసాగించాలి. సంక్షేమ సంఘాలు వంటి సేవా సంస్థలకు కూడా సబ్సిడీలను వర్తింపజేయాలి.
29 సాక్షి ఫన్డే ::: ఆదివారం, ౩౦ జనవరి 2022 వాణిజ్య భవనాల పైన సౌరశక్తి ఫలకాలను ఏర్పాటు చేసుకోవటాన్ని తప్పనిసరి చేయాలి.
9 ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాటాను ఏటేటా 10% పెంచుకుంటూ 200 నాటికి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి.
అ క మెగావాట్ కన్నా ఎక్కువ మొత్తంలో పునరుత్పాదక విద్యుత్తు తయారు చేసేవారి నుంచి పరిశ్రమలు, కంపెనీలు నేరుగా కొనుగోలు చేసుకునే విధంగా ఓపెన్ యాక్సెస్ (థర్డ్ పార్టీ సప్లై)ను ప్రోత్సహించాలి. అ రవాణా, 'విమానయానం, భారీ పరిశ్రమలు, షిప్పింగ్ వంటి రంగాల్లో పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించేందుకు అనువైన తక్కువ ఉద్గారాలను వెలువరించే సాంకేతికతలను అభివృద్ధి చేయాలి. త హైడ్రోజన్ ఇంధనానిదే భవిష్యత్తు అంతా అంటున్నారు . దీనిపై పరిశోధనలను విస్తృతం చేయాలి. పునరుత్పాదక ఇంధనం ధార్మిక కార్యక్రమం కాదు ఒక వాణిజ్యం.
సంపదను సృష్టించే సరికొత్త వ్యాపార నమూనాలను సృష్టించాలి. అ విద్యుత్తు వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలి. పునురుత్పాదక ఇంధనాలతోనే ఈ వాహనాలను చార్జ్ చేసేలా జాగ్రత్త తీసుకోవాలి. థర్మల్ విద్యుత్తుతో ఈ వాహనాలను చార్జ్ చేసుకునే పనైతే కర్చన ఉద్గారాలు తగ్గించాలన్న లక్ష్యాన్ని చేరుకోలేము. త వాహనాల చార్జింగ్కు అవసరమైన మౌలిక సదుపాయాలను విసృతంగా కల్పించాలి. ఆ శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక ఇంధనాలకు మారే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అ సరికొత్త రుణ వితరణ నమూనాలను సృష్టించాల్సిన అవసరం ఉంది.
స్మార్ట్/గ్రీన్'సెటీలు...
రాలను విద్యుత్తు వనరులను పొదుపుగా వాడే స్మార్ట్, గ్రీన్ సి సిటీలు లుగా మార్చుకోవడానికి గాను అన్ని రకాల పునరుత్పాదక ఇంధన వనరులను సమీకృతంగా వినియోగించుకునేందుకు అనువుగా సాంకేతిక ఆవిష్కరణలు తేవాల్సిన ఆవశ్యకత ఉంది. 20/0 నాటికి పర్యావరణ లక్ష్యాలను మనం చేరుకోవాలంటే పునరుత్పాదక ఇంధన వనరుల వార్షిక వృద్ధి రేటు ఐదు రెట్లు పెరగాల్సి ఉంటుంది. ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకోవాలంటే 20/0 నాటికి 60%8 శై పైగా విద్యుత్తు అవసరాలను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా తీర్చుకోగలిగి ఉండాలి. పునరుత్పాదక ఇంధనాల వాడకం వైపు మళ్లించేందుకు ఆర్థికపరంగా ప్రతిబంధకాలను | తొలగించటం మేలు. ఈ విధమైన దూరదృష్టితో పాలకులు విధాన నిర్ణయాలు తీసుకోగలిగితే 207/0 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో $50 లక్షల నుంచి కోటి ఉద్యోగాలను సృష్టించడానికి ఆస్కారం ఉంది. వాతావరణ మార్పు మన ముంగిట్లోకి వచ్చేసిన మాట నిజం... ఇప్పుడు మనల్ని కాపాడగలిగినది పునరుత్పాదక ఇంధనం మాత్రమే!