కాలుష్య నియంత్రణ, పర్యావరణాన్ని పరిరక్షణ ప్రభుత్వాల పనేనన్న భావనతో ఉండొద్దని, ప్రతి పౌరుడు ఇందుకు బాధ్యత తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి బి. విజయసేన్ అన్నారు. శనివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్తు సమావేశంలో నిర్వహించిన జాతీయ కాలుష్య నివారణ దినోత్సవంలో ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాలుష్యంతో జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి ముప్పు వాటిల్లే పనులు చేయొద్దన్నారు.
పర్యావణాన్ని కాపాడుకుంటేనే భావి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు, వృక్ష సంపద ఇవ్వగల మని తెలిపారు. నెదర్లాండ్, డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్ వంటి దేశాలు కాలుష్యరహిత దేశాలుగా ప్రపం చంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. మనల్ని రక్షిస్తాయన్నారు. జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ చట్టాలను గౌరవించి పాటించినప్పుడే అవి సుధాకర్, పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య లక్ష్మీకాంత్ రాథోడ్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అనంత్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పర్యా వరణవేత్తలు ఇంద్రసేనారెడ్డి, పురుషోత్తం రెడ్డి, ప్రసంగిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ సీనియర్ న్యాయవాది మల్లారెడ్డి పాల్గొన్నారు.